ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించి వైసీపీ అభ్యర్థిని ఓడించారు. ఒంటిమిట్టలో 72% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య కొన్ని స్వల్ప ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ, పోలీసులు సరైన బందోబస్తుతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చూశారు. మరోవైపు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6,035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైసీపీకి 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి.