Chalo CMO: చలో CMO ఎఫెక్ట్.. ఉపాధ్యాయుల అరెస్టుతో ఏపీలో హై టెన్షన్..
Chalo CMO: చలో CMO పిలుపుతో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ UTFనేతలు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.;
Chalo CMO: UTF చలో CMO పిలుపుతో ఏపీలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ UTFనేతలు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. విజయవాడలో ఉపాధ్యాయుల అరెస్టుతో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. తమ్మలపల్లి వద్ద మహిళా ఉపాధ్యాయురాలను అరెస్ట్ చేయడాన్ని టీచర్లు భగ్గుమన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చమని అడగడం కూడా పాపమా అని ఆవేదన వ్యక్తం చేశారు. CPS రద్దు కోరుతూ సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి UTF పిలుపునిచ్చింది.
తే UTF చలో CMOను భగ్నం చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ UTFనేతలు, ఉపాధ్యాయులను అరెస్టు చేస్తున్నారు. గృహ నిర్బంధాలు చేస్తున్నారు. UTF చలో CMO నేపథ్యంలో విజయవాడలో హైటెన్షన్ కొనసాగుతోంది. నగర వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ వాహనాలను ఆపేసి తనిఖీలు చేస్తున్నారు. విజయవాడకు ఉపాధ్యాయులెవరూ వెళ్లకుండా ఉక్కుపాదం మోపుతున్నారు. రైళ్లు, బస్సులను తనిఖీ చేస్తూ UTFనేతలు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.