Tadipatri : తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్.. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి

Update: 2025-07-18 12:00 GMT

తాడిప‌త్రిలో మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి - కేతిరెడ్డి పెద్దారెడ్డి వ‌ర్గీయుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాడిప‌త్రిలో పెద్దారెడ్డిని అడుగుపెట్ట‌నివ్వ‌నంటూ జేసీ స‌వాల్ చేస్తుంటే అడుగుపెట్టి తీర‌తానంటూ పెద్దారెడ్డి ప్రతిస‌వాల్ విసిరుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇవాళ తాడిప‌త్రిలో వైసీపీ రీకాలింగ్ చంద్ర‌బాబు మానిఫెస్టో కార్య‌క్ర‌మం తలపెట్టింది. దీనికి పెద్దారెడ్డి హాజరుకానున్నారు. ఈ నేప‌థ్యంలో పెద్దారెడ్డి స్వ‌గ్రామం తిమ్మంప‌ల్లిలో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిప‌త్రిలో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతాన‌ని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు పెద్దారెడ్డిని రానిచ్చేది లేద‌ని ఇప్ప‌టికే జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణ నెలకొంది.

Tags:    

Similar News