వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయి అరాచకాలు, అక్రమాలు, అవినీతి, బెదిరింపులు చేసిందో ఇప్పుడు కూడా అలాగే చేస్తామన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు అక్రమాలు రోజురోజుకూ బయటపడుతున్నా సరే.. జగన్ మాత్రం ఒక్కదానిపై యాక్షన్ తీసుకోవట్లేదు. పైగా వైసిపి నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఏమైనా చేయండి అన్నట్టు చోద్యం చూస్తున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసిపి ఆగడాలు రోజురోజుకు ఇంకా పెరుగుతున్నాయి. ఓవైపు కూటమి ప్రభుత్వం ఏపీని ఎలా డెవలప్మెంట్ చేయాలి అని అహర్నిశలు కష్టపడుతుంది. గూగుల్ లాంటి డేటా సెంటర్లు విశాఖకు వస్తున్నాయి. అంతర్జాతీయ మెటా కంపెనీ సీ కేబుల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. టిసిఎస్ లాంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి.
ఇలా కూటమి అభివృద్ధి వైపు ఆలోచిస్తుంది తప్ప... వైసీపీని కంట్రోల్ చేయడం పై ఫుల్ ఫ్లెడ్జ్ లో ఫోకస్ పెట్టట్లేదు. అందుకే వైసిపి నేతలు ఇంకా రెచ్చిపోతున్నారు. నిన్న పేర్ని నాని ఏసుబాబు అనే ఇన్ స్పెక్టర్ ముందు ఇస్టారీతిన కూర్చొని.. ఒక గవర్నమెంట్ అధికారిపైనే నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అతను అంత మాట్లాడుతున్నా సరే పోలీసులు ఆయనపై ఎందుకు ఈ యాక్షన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా వదిలేస్తుంది అందర్నీ.. ఇలాంటి వాళ్ల వళ్ల శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగి అంతర్జాతీయ కంపెనీలు కూడా వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. శాంతిభద్రతలు లేని రాష్ట్రానికి ఏ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వెళ్ళవు. గత వైసిపి ప్రభుత్వం లో జరిగింది ఇదే. వాళ్ల అరాచకాలు అవినీతి చూసి ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. పైగా ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి.
ప్రజలు అలాంటి అరాచకాలను వద్దు అనే కూటమిని గెలిపించారు. కూటమి హయాంలో అభివృద్ధి బాగానే జరుగుతుంది. సంక్షేమానికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఏపీ ప్రజలకు వచ్చిన ఇబ్బంది మొత్తం వైసిపి నేతలతోనే. ఓవైపు కల్తీ మద్యం దందాతో ఏపీ పరువు తీస్తున్నారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా కల్తీ మద్యం అమ్మి అక్కడి జనాల ప్రాణాలను తీశారు. ఇంకోవైపు పేర్ని నాని లాంటివాళ్ళు అశాంతి సృష్టించేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్లను కూడా ముందుగా కంట్రోల్ చేయాల్సిందే. లేదంటే ఫోటో మీద ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి ప్రయత్నాలు చేసినా వృధానే అవుతాయి. జగన్ ప్రస్తుతం లండన్ కి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లినా సరే వైసీపీ నేతలకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి వెళ్తారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని.. ఓటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రయత్నాలకు భంగం కలిగించాలని ఇలా ఏదో ఒకటి చెప్పి వెళ్తుంటారు. కాబట్టి వైసిపి నేతల ఆగడాలను అరికడితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.