Chandrababu Naidu : ఎమ్మెల్యేల తీరు మారాల్సిందే.. లేదంటే కఠిన చర్యలే..

Update: 2025-11-11 04:50 GMT

వైసీపీ హయాంలో పవన్ కల్యాణ్‌, చంద్రబాబు, లోకేష్ చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఆ కష్టకాలంలో కూడా వీరు వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం పోరాడారు. చివరకు జ‌నసేన-టీడీపీ,బీజేపీ కూటమి ఏర్పడి, భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ కృషి కీలకంగా నిలిచింది. వీళ్లు రాత్రింబవళ్లు కష్టపడి కూటమిని గెలిపించారు. అయితే గెలుపు తర్వాత టీడీపీ లోపల కొన్ని అంశాలు పార్టీ అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గెలిచాక, తమ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారని సమాచారం.

వారిని ఎంకరేజ్ చేస్తూ, వైసీపీ నాయకులకు అవకాశాలు కల్పిస్తున్నారని పార్టీ హైకమాండ్‌కి ఫిర్యాదులు చేరాయి. దీంతో చంద్రబాబు ఇటీవల వీరిపై సీరియస్‌ అయ్యారు. ఇలాగే కొనసాగితే పార్టీకే నష్టం జరుగుతుందని తీరు మార్చుకోవాలని తేల్చి చెప్పారు. కూటమి ప్రయాణానికి అందరూ కలిసి పనిచేయాలని, వ్యక్తిగత సంబంధాలు పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా మారకూడదని హెచ్చరించారు. ఇకపై ఎవరు పార్టీ లైన్ దాటినా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. నిజమే ఇలాంటి వారి వల్ల పార్టీ కార్యకర్తలు చాలా నష్టపోతున్నారు. కష్టకాలంలో కార్యకర్తలు పార్టీ జెండాను వీడలేదు.

ఆ టైమ్ లో వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందలు పెట్టినా వెనకడుగు వేయలేదు. అలాంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలనే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంకరేజ్ చేయడం ఏంటి. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఇప్పుడు గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు కొత్తవాళ్లే. వారికి పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు, లోకేష్ పడ్డ ఇబ్బందులు ఏమీ తెలియవు. ఎలాంటి కష్టం తెలియకుండానే గెలిచారు. కాబట్టి ఇలాంటి వారిపై చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇలాంటి వారి వల్ల పార్టీకి నష్టం జరిగితే.. మరోసారి వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుంది.

Tags:    

Similar News