మాజీ సీఎం జగన్ లో ఓడిపోయాక స్పష్టమైన మార్పులు కొన్ని కనిపిస్తున్నాయి. అవి చూసిన ప్రజలు.. జగన్ ఇలా ఉంటేనే బాగుందంటున్నారు. ఆయన ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండాలంటున్నారు. మనకు తెలిసిందే కదా.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి అరాచక పాలన సాగించాడో. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా సరే హెలికాప్టర్ లోనే వెళ్లేవాడు. ఆయన వస్తున్నాడంటే చాలు.. ఆ రోడ్డు పొడవునా ఉన్న చెట్లను నరికించేవాళ్లు. జగన్ చుట్టూ పరదాలు, బారికేడ్లు పెట్టుకుని వెళ్లేవాడు. అంటే ప్రజలను కనీసం తన దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. దూరం నుంచే ప్రజలకు తన ముఖాన్ని చూపించేవాడు. ఏపీలో ఎలాంటి విపత్తులు వచ్చినా సరే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు.
కనీసం ప్రజలను పట్టించుకోలేదు. రైతులను పరామర్శించడానికి వెళ్తే పొలంలో స్టేజ్ వేయించుకుని.. రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్లాడు. స్టేజి మీద నంచే కాలికి మట్టి అంటకుండా పంటలను ఏదో తప్పదన్నట్టు చూసి వచ్చేసేవాడు. కనీసం రైతుల దగ్గరకు వెళ్లి ఓదార్చేవాడు కాదు. పంటలను కనీసం చేతితో కూడా పట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఇలాంటి అరాచకాలు తట్టుకోలేక ప్రజలు ఓడిస్తే.. ఇప్పుడు కొంత మారాడు. హెలికాప్టర్ లో కాకుండా రోడ్డు మార్గంలోనే వస్తున్నాడు. జగన్ వస్తుంటే ఆ ఏరియాలో చెట్లను కొట్టట్లేదు. పైగా జగన్ చుట్టూ పరదాలు, బారికేడ్లు కూడా తీసేశారు. ఎందుకంటే అవన్నీ ఉంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేతక వస్తోంది కదా.
అందుకే ప్రజలను దగ్గరకు రానిస్తున్నాడు. ఇప్పుడు జగన్ ను దగ్గరి నుంచి చూసే ఛాన్స్ వచ్చింది ప్రజలకు. ఇక నేడు రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్.. స్క్రిప్ట్ మార్చేశాడు. స్టేజీలు వేసుకుని కాకుండా.. పొలంలోకి దిగాడు. కాళ్లకు చెప్పులు లేకుండానే కాస్త ఓవర్ గా బిల్డప్ ఇచ్చి పంటలను పరామర్శించాడు. రైతులను దగ్గరకు రానిచ్చాడు. ఇదంతా స్క్రిప్టు ప్రకారమే పబ్లిసిటీ కోసం చేసిందని ఈజీగానే తెలిసిపోతోంది. ఇదంతా చూసిన ప్రజలు.. ఓహో జగన్ వస్తుంటే చెట్లు కొట్టేయొద్దు అంటే.. జగన్ చుట్టూ బారికేడ్లు పెట్టొద్దు అంటే.. జగన్ పొలంలోకి దిగి పరామర్శించాలి అంటే అధికారం ఉండద్దన్నమాట అనుకుంటున్నారు. ఈ లెక్కన జగన్ ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంటే ఇలా ఉంటాడని.. మళ్లీ అధికారం వస్తే పాత జగన్ లా మారుతాడని కామెంట్లు చేస్తున్నారు.