AP BJP Chief : రైతులకు కూటమి సర్కార్ అండగా ఉంటుంది - ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

Update: 2025-08-07 17:00 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అద్భుత పాలన అందిస్తుందని బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. రైతులకు సర్కార్ అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది రైతులు నిర్ణీత విస్తీర్ణం కన్నా పొగాకు పంటను ఎక్కువ పండించారని.. దాంతో మార్కెట్‌లో ఆశించిన ధర రావడం లేదని అన్నారు. అయితే రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన చాయ్‌ పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేంద్రం సహకారంతో ఏడాదిలో ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మాధవ్ తెలిపారు. సంపదను సృష్టించి.. ప్రజలకు పంచడం జరగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు కలిసి పోటీచేస్తాయన్నారు. ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయన్నారు. ట్రంప్ అడ్డదిడ్డమైన సుంకాలతో దేశ వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News