ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండుతున్నాయి. ఆదివారం కర్నూలులో అత్యధికంగా 37 డిగ్రీల సెంటీగ్రే డ్ ఉష్ణోగ్రత నమోదు కాగా, కళింగపట్నంలో 19.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 2,3 రోజుల్లో 40 డిగ్రీలకు చేరువైనా ఆశ్యర్యపోనక్కరలేదు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాల్లో ఆగ్నేయ నైరుతీ నుంచి గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎండల అధికమవ్వడంతో వివిధ పనులపై బయటకు వెళ్ళే ప్రజలు అల్లాడిపోతున్నారు. పరీక్షల కాలం కావడంతో విద్యార్థులకు ఎండ పాట్లు తప్పడం లేదు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో శీతలపానీయాలకు క్రమేపీ డిమాండ్ పెరుగుతోంది. మధ్యాహ్న సమయాల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వేడి గాలులు మరింత పెరిగితే పరిస్థితి తీవ్రం అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు హడలెత్తుతున్నారు. మొత్తం మీద ఈ సమ్మర్ ప్రారంభంలోనే జనానికి చమటలు పట్టిస్తోంది.