ప్రముఖ వాయు లింగ క్షేత్రంగా పిలువబడే శ్రీకాళహస్తి దేవస్థానంలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... మంగళవారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి దేవస్తానం లో 50 రూపాయలు టిక్కెట్ కౌంటర్ లో చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి మొదటి గేటు దగ్గర ఉన్న చెట్టు ఎక్కి ఆలయంలోకి దిగి మొదటి గేటు వద్ద ఉన్న 50 రూపాయలు టిక్కెట్ కౌంటర్ ను పగులగొట్టి అందులో ఉన్నటువంటి కలెక్షన్ 5, 800 రూపాయలు చోరీ చేసినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచారు. ఆలయం రాత్రి పూట మూసేటుప్పుడు ఆలయ ఎవరణములోని అన్ని ప్రాంతాల్లో పూర్తిగా పరిశీలించిన తరువాత ఆలయాన్ని మూసివేస్తారు,కానీ ఆలయంలో సెక్యూరిటీ గార్డ్ లు తమ విధులు సరిగా నిర్వహించ లేదని నిర్లక్ష్యం ఈ చోరీ విషయం ద్వారా బయట పడింది. అసలు విషయాన్ని బయటకు రానీయకుండా అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఈ చోరీ విషయం పోలీసులు తెలియపరిచారు ఆలయ అధికారులు. నెల్లూరు కి సంబంధించిన ఓ వ్యక్తి ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అసలు ఆరోజు విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని అటు భక్తులు, ఇటు స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ఇంత సెక్యూరిటీ సిబ్బంది ఉన్నపటికీ వెలుపలి వ్యక్తులు ఆలయంలోకి ఎలా వచ్చారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇకనైనా ఆలయ అధికారులు ఈ విషయం పై దృష్టి పెట్టాలని, ఇటువంటి సంఘటనలు మరలా చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.