TDP : సైకిల్ గాలిలోనూ గెలవలేని దురదృష్టవంతులు వీళ్లే!

Update: 2024-06-06 07:52 GMT

ఏపీ అసెంబ్లీలోని 175 సీట్లకు గాను.. టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీచేసింది. 135 ఎమ్మెల్యే, 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలోనూ పోటీ చేసి వందశాతం సీట్లలో గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. భారతీయ జనతాపార్టీ 8 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా టీడీపీ కూటమి వేవ్ ఏపీ ఎన్నికల్లో కనిపించింది. ఇంతటి వేవ్ లోనూ ఓ 11 మందిని దురదృష్టం వెంటాడింది.

పులివెందులలో వైసీపీ అధినేతపై పోటీచేసిన బీటెక్ రవి ఓడినా కూడా జగన్ ఆధిక్యం తగ్గించడంలో సక్సెస్ అయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామ చద్రారెడ్డి టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 6095 ఓట్ల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పదివేల ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి మీద విజయం సాధించారు. మంత్రాలయంలోనూ టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మీద.. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి 12 వేల 805 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బాల సుబ్రమణ్యం మీద వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి 7016 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం.. మాత్రం బీజేపీ అభ్యర్థి రాజారావుపై 91 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. పాడేరులో టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై వైసీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు 18వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. బద్వేలు నియోజకవర్గంలో దాసరి సుధ.. బీజేపీ క్యాండిడేట్ బొజ్జ రోషన్న మీద ఏకంగా 18 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అలూరులో వైసీపీ అభ్యర్థి విరూపాక్షి.. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ మీద 2831 ఓట్ల తేడాతో గెలవగా.. దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై 2456 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Tags:    

Similar News