Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident: కారులో ప్రయాణిస్తున్న వారంతా అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు;
Road Accident: కర్నూలు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారును లారీ ఢీకొట్టడంతో. ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
కారులో ప్రయాణిస్తున్న వారంతా అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. చనిపోయిన వారిని గణేష్, రుద్ర, సోమశేఖర్‌గా నిర్ధారించారు. యువకులంతా కర్నూల్‌లోని తుంగభద్ర హోటల్‌లో పని చేస్తున్నట్లు చెబుతున్నారు