PROTETST: ఉత్తరాదిన జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు
తిరుపతి లడ్డూ కల్తీపై భగ్గుమంటున్న భక్తులు... ఇండియా కూటమిలోకి ఇక కష్టమే..!;
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. వైసీపీకి తలనొప్పిగా మారింది. రోజువారీ వ్యవహారాలు బోర్డే చూసుకుంటుందని వైసీపీ చీఫ్ జగన్ చెప్పినా.. తప్పందా ఆ పార్టీదే అని పార్టీలు విమర్శిస్తున్నాయి. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు జరగకపోయినా.. ఉత్తరాదిన మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. దీంతో ఉత్తరాదిన జగన్ హిందూ వ్యతిరేకిగా మారిపోయారు. ఇప్పటికే తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ఇది కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడిన బంధం కావడంతో ప్రస్తుతం జగన్ కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లడం కష్టమే. కాంగ్రెస్ వైపు వెళ్లడం మంచిదనుకున్న వైసీపీకి.. ప్రస్తుత వివాదం ఊహించని కష్టాలను కూడా తెచ్చిపెట్టింది.
మంచు మెహన్‌బాబు ఆవేదన
లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయానని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరాతి ఘోరమని, హేయమని, పాపమని.. ఇదే నిజమైతే నేరస్థుల్ని శిక్షించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని మోహన్ బాబు కీర్తించారు. అలాంటి దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు.నిత్యం తన మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని అన్నారు.
ప్రకాశ్ రాజ్.. అంత వద్దు: మంచు విష్ణు
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయాన్ని జాతీయ సమస్యగా చూపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి విషయాల్లో సంయమనంతో వ్యవహరించాలని ప్రకాశ్ రాజ్ కు హితవు పలికారు. ‘‘ప్రకాశ్‌రాజ్.. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అసలు మతం ఏ రంగు పులుముకుంటోంది. ఆలోచించండి’ అని సూచించారు.