CBN: చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని మోదీ, జగన్, పవన్ శుభాకాంక్షలు;
ఏపీ సీఎం చంద్రబాబు నేడు 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 30 ఏళ్ల వయసులో మంత్రి అయ్యారు. ఉమ్మడి ఏపీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కలిపి నాలుగుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాలనలో తన ప్రత్యేకత చాటుకున్నారు.
మోదీ, జగన్ బర్త్ డే విషెస్
సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. అలాగే, ‘నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఏపీ అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అని TG సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. నా మిత్రుడు, సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
చిరంజీవి శుభాకాంక్షలు
ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘X’ వేదికగా CBNకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకున్నా’ అని రాసుకొచ్చారు.
శుభాకాంక్షలు తెలిపిన పవన్
సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం బాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. ఈ సందర్భంగా చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన సంపూర్ణ ఆయుషు, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అని ట్వీట్ చేశారు.