Tirupati : యువకుడు రన్నింగ్ చేస్తుండగా విషాదం.. గుండెపోటుతో..

Update: 2025-07-18 10:45 GMT

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరిని కబలిస్తుంది. ఇటీవలే తొమ్మిదేళ్ల చిన్నారి సైతం స్కూల్లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆరోగ్యంగా కనిపిస్తున్న వారు కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇలా కారణం ఏదైనా ..చిన్న వయసులో నే ప్రాణాలు కోల్పోతున్నారు.. తాజాగా అలాంటి విషాద ఘటన తిరుపతి జిల్లా లో చోటు చేసుకుంది.                             

తిరుపతి జిల్లా నాగలపురం మండలం సురుటుపల్లికి చెందిన భాస్కర్ (21) డిగ్రీ పూర్తి చేశాడు. చదువు, ఆటల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే భాస్కర్ కు పోలీస్ కావాలని ఆశ. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడుతూ ఉండేవాడు భాస్కర్. స్నేహితులతో కలిసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. భాస్కర్ స్నేహితులు ఆసుపత్రి కి తరలించే లోపే చనిపోయాడు. గుండె పోటుతో చనిపోయాడని నిర్ధారించారు డాక్టర్లు. పోలీస్ అయి తమకు మంచి పేరు తీసుకొస్తాడనుకున్న కొడుకు ఇలా అర్థంతరంగా చనిపోవడంతో భాస్కర్ తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags:    

Similar News