శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి మారుతీ నగర్ లో వినాయక నిమజ్జనం ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తుండగా ట్రాక్టర్ పై ఉన్న డ్రైవరు బ్రేకు వేయకుండా ట్రాక్టర్ ఎక్స్ లెటర్ తొక్కడంతో ఒకసారి జోరుగా వెళ్లిన ట్రాక్టర్ ముందు వెళ్తున్న మారుతి అనే వ్యక్తిపై దూసుకెళ్లింది అతనికి తీవ్ర గాయాలు కావడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. భాగ్యమ్మ అనే మహిళ కు ట్రాక్టర్ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాధితురాలని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. చింతలవీధి గ్రామంలో వినాయక నిమజ్జనం కోసం వెళుతుండగా ఓ స్కార్పియో వాహనం అతి వేగంగా వచ్చింది. ఊరేగింపులో ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీతారామ్, కొండబాబు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని పాడేరు ఆసుపత్రికి తరలించారు.