కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని కుప్పం టిడిపి కార్యాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. లారీ చక్రాల కింద ఇరుక్కున్న మృతదేహాన్ని పోలీసులు బయటకు లాగారు. ఫ్లై ఓవర్ పై వస్తున్న ద్విచక్ర వాహనం సడన్గా కుప్పం వైపు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మరో లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ఘటన స్థలంలోనే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది..