ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించి స్వామివారి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ వేద పండితులు ఆశీర్వచనం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి తిరుమలలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సీఎంకు ఆహ్వాన పత్రం అందజేశారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో చేస్తోన్న ఏర్పాట్ల గురించి సీఎం చంద్రబాబు.. బీఆర్ నాయుడిని అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరారు.
టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని తీసుకువచ్చింది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ లక్కీ డీప్ సిస్టమ్ ద్వారా విడుదల చేయనున్నది.