Dollar Seshadri: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
Dollar Seshadri: కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన శేషాద్రి
Dollar Seshadri: శ్రీవారి ఆలయ ఓఎస్డీగా సేవలు అందిస్తున్న డాలర్ శేషాద్రి కన్నుమూశారు. ఈ వేకువజామున డాలర్ శేషాద్రికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన శేషాద్రికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది.
దీంతో రామ్‌నగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాని, అక్కడికి చేరుకునే లోనే ఊపిరి ఆగిపోయింది. డాలర్ శేషాద్రి తన తుది శ్వాస వరకు స్వామివారి సేవలోనే తరించారు. నిన్న కూడా సింహాచలం అప్పన్న సేవలోనే కనిపించారు.
టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి భౌతికకాయానికి ఎంబాంబింగ్ ప్రక్రియ పూర్తయింది. కేజీహచ్ ఎనాటమీ విభాగంలో దాదాపు రెండు గంటలపాటు ఈ ప్రక్రియ చేపట్టారు వైద్యులు.
శేషాద్రి భౌతిక కాయాన్ని విశాఖ నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి తీసుకొస్తున్నారు. తిరుపతి గోవిందధామంలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శేషాద్రి మరణం తీరని లోటు అని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సంతాపం తెలిపారు.