వైసీపీ పాలనలో సున్నా వడ్డీ రుణాల పథకం ఓ బోగస్‌గా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం విధించిన షరతుల వల్ల కేవలం 80 శాతం మంది రైతులకు మాత్రమే పథకం వర్తిస్తుందని చెప్పారు. పథకాన్ని రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే సున్నా వడ్డీ రుణాల పథకం ప్రవేశపెట్టామని తెలిపారు.