Tuni : తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా

Update: 2025-02-18 08:45 GMT

తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠ మధ్య వాయిదా పడింది. వైస్‌ చైర్మన్ ఎన్నికలో టీడీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఎన్నికకు 17మంది వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. వారంతా తుని చైర్‌పర్సన్‌ ఇంట్లోనే ఉన్నారు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి వైస్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేశారు. తునిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎదురెదురుగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు నివారించే ప్రయత్నం చేసినా ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. దాంతో ప్రజలు భయం భయంతో బిక్కుబిక్కుమన్నారు. అలాగే మాజీ ఎంపీ గీతను పోలీసులు నిలిపివేశారు.

మాజీమంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాపై తునిలో రెండు కేసులు నమోదయ్యాయి. టీడీపీ నాయకుడిపై దాడి, కౌన్సిల్ సభ్యులు నిర్బంధించినందుకు మరో కేసు నమోదు చేశారు. ఇక మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి చేరుకోగా... అప్పటికే ఆయన బయటకి వెళ్లిపోయారు. దాంతో తుని సమీపంలో ముద్రగడ పద్మనాభం వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. 

Tags:    

Similar News