నెల్లూరు జిల్లా మనుబోలు మండలం నాయుడు పల్లి గ్రామం కు చెందిన ఇద్దరు వృద్ధులైన కోటపాటి రత్నయ్య కోటపాటి సుబ్బయ్య అనే అన్నదమ్ములు అనంతసాగరం మండలంలోని సోమశిల అటవీ ప్రాంతంలో ఉన్న మల్యంకొండ అనే ప్రాంతంలో ఉన్న మల్లంకొండ స్వామి దేవాలయ దైవదర్శనానికి కాలి నడకన వెళ్లి ఇద్దరు వ్యక్తులు అదృశమయ్యారు.. ఇంటి నుండి వెళ్లి ఐదు రోజులవుతున్న తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలతో అటవీ ప్రాంతం అంతా వెతికి చివరికి మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఈ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే పోలీసులను అప్రమత్తం చేశారు.. అలాగే తప్పిపోయిన వారి బంధువులు ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి శేఖర్ ను ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు.. ఈ విషయమై ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి శేఖర్ సంఘటనస్థల జరిగిన విషయాన్ని వివరించారు...ఇద్దరు వ్యక్తులు అడివిలో అదృశ్యమయ్యారు అనే విషయం తెలియడంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడవిని తెలిసిన స్థానికులతో కలిసి అందరూ 40 మంది బృందంగా ఈరోజు అడివిలోకి తప్పిపోయిన వీరి ఆచూకీ కనుగోనెందుకు వెళ్లారు... అలాగే జిల్లా ఎస్పీ కృష్ణ ఆదేశాలతో వీరి ఆచూకీ తెలిపిన వారికి పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు... ఇద్దరు వృద్ధులు ఐదు రోజుల క్రితం అడవిలోకి వెళ్లి జాడ కనిపించకపోవడంతో స్థానికుల్లో సైతం ఆందోళన నెలకొంది.