ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో హిజ్రాల గొడవ సంచలనం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ వేదికగా రెండు హిజ్రా గ్రూపులు గొడవకు దిగాయి. విజయవాడకు చెందిన హిజ్రాలు ఇబ్రహీంపట్నం వారిపై దాడి చేసే వరకు వెళ్ళింది. కొండపల్లిలో వారి మధ్య జరిగిన పోరు అంతకంతకూ పెరిగింది. ఇబ్రహీంపట్నంకు చెందిన హిజ్రాలు కేసు పెట్టారు. విజయవాడకు చెందిన వందల మంది స్టేషన్‌కి వచ్చి గొడవకు రావడంతో పోలీసు స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఏం జరుగుతుందో కొన్ని గంటల పాటు స్థానికులకు అర్థం కాలేదు. దీంతో..పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించేశారు.