తిరుపతి ప్రచారానికి జగన్ ఎందుకు వెళ్లలేదు ?: వర్ల రామయ్య
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం జగన్ ఎందుకు వెళ్లలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.;
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం జగన్ ఎందుకు వెళ్లలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. కరోనా వస్తుందని వెళ్లలేదా? లేక... బాబాయి హత్యపై ప్రజలు నిలదీస్తారని వెళ్లలేదా? అన్నారు. వివేకా హత్యపై సంబంధం లేదంటూ ప్రమాణం చేయాలని లోకేష్ విసిరిన సవాల్‌కు భయపడి వెళ్లడం లేదా? అని ప్రశ్నించారు. తిరుపతి ప్రజలు జగన్‌ను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని నిఘా విభాగం నివేదిక ఇచ్చిన మాట నిజమా? కాదా? అన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి లై-డిటెక్టర్, నార్కో అనాలసిస్ టెస్ట్ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. జగన్ చెప్పనందున డీజీపీ గౌతమ్ సవాంగ్ నిందితుల్ని పట్టుకోవడంలో సీబీఐకి సహకరించడం మానేశారా అని ప్రశ్నించారు.