హైదరాబాద్, విజయవాడ హైవే బంద్ అయ్యింది. రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర రెండు రోజుల పాటు పాలేరు వాగు ఉప్పొంగింది. వరద ప్రవాహం తగ్గినప్పటికి బ్రిడ్జ్ కూలిపోయింది.
పునరుద్దరణ పనులు చేస్తే తప్ప.. విజయవాడ వైపు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లిస్తున్నారు. పాత బ్రిడ్జ్ ను పునరుద్దరీంచేవరకు వాహనదారులకు ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు.
మరోవైపు బ్రిడ్జ్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.