కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ రూపు రేఖలు మారిపోతున్నాయి. విశాఖపట్నంను టెక్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయయి. అంతర్జాతీయ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం బాగా కలిసొస్తోంది. మెటా బిలియన్ డాలర్ల అండర్ సి కేబుల్ సెంటర్, గూగుల్ డేటా సెంటర్లు, టీసీఎస్ కొత్త టెక్ క్యాంపస్.. ఇవన్నీ విశాఖను ఇండియా ఫ్యూచర్ డిజిటల్ కోర్ హబ్ గా మార్చేస్తున్నాయి. మెటా అండర్ సి కేబుల్ ప్రాజెక్ట్ గురించే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మెటా తన ప్రాజెక్ట్ వర్త్ సి కేబుల్ ను విశాఖ తీరం ముంబై తీరాలకు కనెక్ట్ చేస్తోంది. 50వేల కి.మీ పొడవైన ఈ కేబుల్.. అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియాను.. ఇలా ఐదు ఖండాలను కలుపుతోంది.
2030 నాటికి ఇది మల్టీ టెరాబిట్ ఇంటర్నెట్ హబ్ ను విశాఖకు తెస్తోంది. ఇది కేవలం కేబుల్ కాదు.. ప్రపంచ నెట్ కు ఫ్యూచర్ కాబోతోంది. ఇక గూగుల్ అమెరికా బయట ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలోనే ఏర్పాటు కాబోతోంది. ఇక్కడ ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఇంత వరకు ఇండియాలో డేటా ల్యాండింగ్ పాయింట్స్ ముంబై, చెన్నైలకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు విశాఖలో ఇది ఏర్పాటు కాబోతోంది. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు వచ్చాయి. నేషనల్ ఏఐ మిషన్, డిజిటల్ 2.0 లాంటి నిర్ణయాలు విశాఖను డిజిటల్ హబ్ గా మార్చేస్తున్నాయి. ఇప్పటి వరకు తరంగాలను తెచ్చే నౌకలు.. ఇక నుంచి నెట్ ను తీసుకురాబోతున్నాయి.
దీంతో నేషనల్ వైడ్ గానే కాదు.. ప్రపంచానికే మార్గదర్శిగా ఉండబోతోంది విశాఖ. జగన్ హయాంలో విశాఖ మూగబోయింది. ఎలాంటి కంపెనీలు రాక విలవిలలాడిపోయింది. కానీ ఇప్పుడు కూటమి హయాంలో సాంకేతిక విప్లవం ఏపీలోని విశాఖకే రాబోతోంది. ఇక్కడే ఇంరట్నేషనల్ కంపెనీలు కొలువుదీరుతున్నాయి. ప్రపంచంలోనే మేటి కంపెనీలు అమెరికా తర్వాత విశాఖలోనే తమ అతిపెద్ద పెట్టుబడులు పెడుతున్నాయంటే.. ప్రపంచానికి రాబోయే కాలంలో అతిపెద్ద టెక్నికల్ సెంటర్ విశాఖనే కాబోతోంది. డేటా పరంగా ఆసియాలోనే ఏకైక సెంటర్ గా విశాఖ నిలవడం అంటే ఏపీకి నిజంగా గర్వకారణమే కదా.