వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు మీదుగా హైదరాబాద్ ను పారిపోతుండగా.. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. వర్రా రవీందర్‌రెడ్డిని కడప తరలించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా వర్రా ఉన్నాడు. వర్రా రవీందర్‌రెడ్డి సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు అభియోగాలు ఉన్నాయి. దాంతో మంగళగిరి, హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి.