AP : ఈసారైనా బాలయ్యకు మంత్రి పదవి దక్కేనా?

Update: 2024-06-10 05:41 GMT

సినీనటుడు నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) హిందూపురం నుంచి వరుసగా మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. 2014 నాటి చంద్రబాబు మంత్రివర్గంలో బాలయ్యకు స్థానం దక్కలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఈసారైనా బాలకృష్ణకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకుగా, పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు అడుగుతున్నారు.

బాలకృష్ణ అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విజయంతో హ్యాట్రిక్ కొట్టారు. మరోవైపు హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ సాధించారు. రెండు రంగాల్లో బాలయ్య అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

ఒక వేళ బాలయ్య కు మంత్రి పదవి వస్తే ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాను పూర్తి చేస్తాడేమో. ఆ తర్వాత సినిమాలకు బాలయ్య బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మరో వారం పది రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News