ఏలూరు జిల్లా జైలులో ఓ మహిళా ఖైదీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మహిళల బ్యారక్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న శాంతకుమారి చున్నీతో ఉరివేసుకుంది. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసుబాబు(31)కు తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతికుమారి(29)కి 12 ఏళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే మార్చి 18వ తేదీన బోసుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని వెంటనే ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి.. శాంతకుమారి ఆమె ప్రియుడు సొంగా గోపాల్‌తో కలిసి భర్త బోస్ హత్యకు కుట్ర చేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమెను మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. జడ్జి రిమాండ్ విధించారు. దీంతో ఇద్దరిని జిల్లా జైలుకు తరలించారు. శాంతకుమారి(31)ని మహిళా బ్యారక్‌లో ఉంచారు. ఉదయం తోటి ఖైదీలు మెస్‌కు వెళ్లిన సమయంలో శాంతాకుమారి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్‌వార్డర్ వరలక్ష్మి, నాగమణి సస్పెన్షన్ కు గురయ్యారు.