AP : నల్లపురెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది : రాయపాటి శైలజ
వైసీపీ నేత, మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మహిళా నేత, శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా, సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయని మహిళ కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళలను అవమానించేలా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన నల్లపురెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది. మహిళలను చులకనగా చూడటం, వారిపై దారుణమైన ప్రచారం చేయడం వంటి నీచమైన వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే కుట్రగా పరిగణించాలి. రాష్ట్రంలో మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ చిన్న వ్యాఖ్యలు అయినా సహించే ప్రసక్తి లేదు. ఇటువంటి విషపూరిత ఆలోచనాధోరణి, వ్యాఖ్యలు, బాధ్యతారహిత ప్రవర్తన సమాజంలో విద్వేషాన్ని, ద్వేషాన్ని రగిలిస్తాయి.. ఇలాంటి సభ్యసమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసినవారు ఎంతటి వ్యక్తులైనా, వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. విచారించి చట్ట పరమైనచర్యలు తీసుకుంటాయమని తెలిపారు.