ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను ఈనెల 24 లేదా 27న జనసేనలో చేరనున్నట్లు సమాచారం. కాగా, జనసేనలో చేరికపై ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని గ్రామాల నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. వారి నుంచి లైన్ క్లియర్ కావడంతో బ్యానర్లు, పార్టీ జెండా దిమ్మె పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి టాటా చెప్పేశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. సినీ నటుడు అలీ కూడా తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు. మద్దాలి గిరి, కిలారు రోశయ్య, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు పార్టీని వీడారు. అయితే, వారింకా ఏ పార్టీలోనూ చేరలేదు. తాజాగా, జగన్ సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్న ఉదయభాను పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు తెలుస్తోంది.