అధికారం పోయి ప్రజలు పట్టించుకోక ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన పార్టీ వైసిపి. గత ఐదేళ్లలో వైసిపి అరాచకాలను తట్టుకోలేక.. ఏపీ అభివృద్ధి అట్టడుగున పడిపోతే ప్రజలు తిరగబడి ఆ పార్టీని అత్యంత దారుణంగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పార్టీకి ఇంత ఘోరమైన ఓటమి దక్కింది. ప్రజలు ఇంత దారుణంగా ఓడించినా సరే జగన్ అండ్ కో అస్సలు మారట్లేదు. ఈ క్రమంలోనే జగన్ నేతలను, కార్యకర్తలను ఏ మార్చేందుకు రకరకాల హామీలు ఇచ్చేస్తున్నాడంట. వైసీపీ అధికారంలోకి రాగానే నీకు మంత్రి పదవి ఇచ్చేస్తాను అని ఎవరికి పడితే వారికే కహానీలు చెబుతున్నాడు. అసలే వైసిపి బ్యాచ్ జగన్ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారు కదా.
అందుకే జగన్ చెప్పిన ఈ మాటలను కూడా నమ్మేసి.. సదరు జిల్లా స్థాయి నేతలు తాము వచ్చే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు అయిపోతున్నామని.. ఫలానా శాఖ మనదే అంటూ కార్యకర్తలకు గప్పాలు కొట్టేసుకుంటున్నారంట. ఇది విన్న కార్యకర్తలు మైండ్ బ్లాంక్ అయిపోతుందట. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ఇమేజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పిచ్చి రాజకీయాలు చేయకుండా కేవలం అభివృద్ధిపైనే మాటలు మాట్లాడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏ స్థాయిలో కృషి చేస్తుందో మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా నిర్మాణాలు పూర్తయిపోయి అభివృద్ధి వేగంగా పరుగులు పెడుతుంది. ఇంకోవైపు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తో పాటు అనేక ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తున్నాయి. జగన్ హయాంలో ఒక్క కంపెనీ కూడా రాకపోతే ప్రజలు కల్లారా చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి పడేసరికి ప్రజలు కూటమి పనితనాన్ని ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు.
దీంతో నానాటికి కూటమి ఇమేజ్ అమాంతం డబుల్ అవుతుంది. కూటమికి ప్రజల్లో పెరుగుతున్న గ్రాఫ్ చూస్తుంటే ఇంకో రెండు టర్మ్ లు కూడా కూటమి వచ్చేలాగా ఉంది. ఆ లెక్కన వైసీపీకి అసలు డిపాజిట్లు కూడా దక్కుతాయో లేదో అనే పరిస్థితిలో పడింది. ఇలాంటి సమయంలో జగన్ వచ్చి ఈ పిచ్చి హామీలు ఇవ్వడం ఏంటని.. ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పసలేని హామీల వల్ల ఒరిగేది ఏమీ లేదని.. కూటమి ప్రభుత్వం లాగే అభివృద్ధి గురించి మాట్లాడితే ఏదైనా లాభం ఉంటుందని వాపోతున్నారు పార్టీ కార్యకర్తలు.