YCP: మంచం కింద దొరికిన వైసీపీ నేత

స్పా సెంటర్‌లో అడ్డంగా దొరికిన శంకర్‌నాయక్... అరెస్ట్ చేసిన పోలీసులు;

Update: 2025-02-24 04:00 GMT

విజయవాడలోని ఓ స్పా సెంటర్‌లో వైసీపీ నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ అడ్డంగా దొరికిపోయారు. గురునానక్‌ కాలనీలో స్టూడియో09 పేరుతో నిర్వహిస్తున్న స్పా సెంటర్‌లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేయడంతో వైసీపీ నేత శంకర్ నాయక్ తప్పించుకోలేక మంచం కింద దూరారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏ10గా కేసు నమోదు చేశారు. తరచూ ఈ వ్యభిచార గృహానికి వచ్చి శంకర్‌నాయక్‌ జల్సాలు చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈసారి కూడా అలా వచ్చిన సమయంలో పోలీసులు దాడి చేయడంతో తప్పించుకునే వీలులేక మంచం కింద దూరారు. గదిలోకి వచ్చిన పోలీసులకు మహిళ మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి వెతకగా.. మంచం కింద దాక్కున్న శంకర్‌నాయక్‌ కనిపించారు. వైసీపీ నేతలంతా మంచివాళ్లు, సౌమ్యులు, అందగాళ్లంటూ ఓపక్క జగన్ చెప్తుంటే మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం ఇలాంటి వ్యవహారాల్లో అడ్డంగా దొరుకుతున్నారు. ఓ గదిలో మంచం కింద నక్కిన వైసీపీ నేత శంకర్‌నాయక్‌ను బయటకు రమ్మని పోలీసులు సూచించినా రాకపోవడంతో వాళ్లే లాగి తీసుకొచ్చారు. తనను వదిలేయాలంటూ తిరిగి పోలీసులపైనే జులుం ప్రదర్శించినట్లు తెలిసింది. ఈ కేసులో శంకర్‌నాయక్‌ను ఏ10గా నమోదు చేశారు.


వైసీపీ అధినేత జగన్‌కు శంకర్‌నాయక్‌ అత్యంత సన్నిహితుడు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శంకర్‌నాయక్‌ ఈ నెల 9 వరకు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా కొనసాగారు. ఈ సమయంలో ఎక్కడ ఏ వివాదం జరిగినా అక్కడ ప్రత్యక్షమై.. అధికారులు, పోలీసులను బెదిరిస్తూ, తాను చెప్పినట్లు నడుచుకోవాలంటూ హుకుం జారీ చేసేవారు.

Tags:    

Similar News