ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా తయారైందంటే.. ఎక్కడ ఏ ప్రాజెక్టు పూర్తి అవుతున్నా సరే అది మేమే కంప్లీట్ చేశాం అని క్రెడిట్ కొట్టేసే పనిలోపడ్డారు ఆ పార్టీ నేతలు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయలేదు. కేవలం విధ్వంసం మాత్రమే చేశారు. ఒక్క ఫ్యాక్టరీ కట్టలేదు, కంపెనీ తేలేదు. రోడ్లు వేయలేదు. ఎయిర్ పోర్టులు, అమరావతి, పోలవరం లాంటివన్నీ గాలికొదిలేశారు. ఇప్పుడు కూటమి వాటన్నింటినీ కడుతుంటే వచ్చి క్రెడిట్ మాకివ్వండి అని తప్పుడు ప్రచారాలు మాత్రం చేస్తోంది. మొన్న భోగాపురం ఎయిర్ పోర్టును కూటమి పూర్తి చేస్తే.. అబ్బే అది మాదే అంటూ వైసీపీ డ్రామాలకు తెరతీసింది. ఒకప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టుపై కేసులేసి అడ్డుకున్న జగన్.. ఇప్పుడు క్రెడిట్ కావాలంటూ పాకులాడుతున్నారు.
కానీ ప్రజలు ఛీ కొట్టడంతో యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు పనిలో పనిగా ఆర్వోబీ మీద పడ్డారు. చీపురుపల్లిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలను విశాఖపట్నంతో పాటు ఒడిశాతో అనుసంధానం చేసే కీలకమైన బ్రిడ్జి పూర్తి అయింది. రోజూ వేలాదిమంది ప్రయాణించే ఈ మార్గం ఆర్టీసీకి ఆదాయ మార్గంగా ఉండటంతో పాటు అత్యవసర వైద్య, వాణిజ్య, విద్యా అవసరాలకు కూడా కీలకంగా ఉంది. ఇంకేముంది ఇక్కడ క్రెడిట్ కొట్టేసేందుకు వైసీపీ రెడీ అయింది. నిన్న వైసీపీ మాజీ ఎంపీ చంద్రశేఖర్ తన కార్యకర్తలను తీసుకెళ్లి వైసీపీ జెండాలతో హడావిడి చేశారు. రోడ్ల మీద జెండాలు పాతి తామే పూర్తి చేశాం అని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి అనధికారికంగా ఓపెనింగ్ చేశారు.
ఇది చూసిన ప్రజలంతా ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని కంప్లీట్ చేసి కొబ్బరి కాయ కొట్టాలి. పోలవరం కంప్లీట్ చేసి ఓపెన్ చేయాలి. లేదంటే ఏదైనా ప్రాజెక్టు, రోడ్లు పూర్తి చేసి కొబ్బరికాయలు కొడిగే బాగుండేది కానీ.. ఇలా బరితెగించి క్రెడిట్ కొట్టేయడం ఏంటి ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు ఇలా చేయలేదు అని ప్రజలు వాపోతున్నారు. కానీ వైసీపీ మాత్రం ప్రజలు ఎంత తిట్టినా పట్టించుకోకుండా ఇలా క్రెడిట్ కోసం పాకులాడుతోంది. అయినా సరే వారిని ప్రజలెవరూ నమ్మట్లేదు.