Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి మృతదేహం
Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో యువకుడి డెడ్‌బాడీ ఉండడం కలకలం రేపింది.;
Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో యువకుడి డెడ్‌బాడీ ఉండడం కలకలం రేపింది. నిన్న ఉదయం గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యం అనే వ్యక్తిని కారులో తీసుకెళ్లారు ఎమ్మెల్సీ అనంత బాబు.
అర్ధరాత్రి డెడ్‌బాడీతో తిరిగి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో సుబ్రమణ్యం చనిపోయాడని కుటుంబసభ్యులకు చెప్పాడు. కుటుంబసభ్యుల ఆందోళనతో డెడ్‌బాడీతో పాటు కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు అనంతబాబు. సుబ్రమణ్యం ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర ఐదేళ్ల పాటు డ్రైవర్‌గా పని చేశాడు.
నాలుగు నెలల క్రితమే పని మానేశాడు. ఐతే సుబ్రమణ్యం మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రమణ్యంను హత్య చేశారంటూ ఆరోపిస్తున్నారు.