క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జరిగింది. అంగలూరికి చెందిన కొమ్మాలపాటి సాయి(26) హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న క్రిస్మస్ సెలవు కావడంతో ఇంటికి వచ్చి స్నేహితులతో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లాడు. బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే గుడివాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అప్పటివరకు ఎంతో హుషారుగా క్రికెట్ ఆడిన సాయి మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.