ఏపీకి చెందిన తెలుగు యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తన అమ్మమ్మ ఇంట్లో ఉరేసు కొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోం ది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి ఇన్ స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక అభి మానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు వివాహం అయిన ప్రతాప్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికిదారి తీసింది. తమ కూతురు మృతికి ప్రతాప్ కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మధుమతి మరణాన్ని అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు, ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే మధుమతి మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.