YS Jagan: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం- సీఎం జగన్
YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కోవిడ్, వైద్యరంగంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు.;
YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కోవిడ్, వైద్యరంగంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు సీఎం జగన్.. కరోనా టైంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 44 సార్లు ఇంటింటి సర్వే నిర్వహించినట్లు చెప్పారు. వాలంటీర్ల సాయంతో ఇంటింటి సర్వే ద్వారా జ్వరం ఉన్న వాళ్లను గుర్తించామన్నారు. దేశవ్యాప్తంగా ఏపీలోనే అతి తక్కువ కోవిడ్ మరణాల రేటు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు లేవన్నారు జగన్. కోవిడ్ వ్యాప్తి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపించామన్నారు జగన్. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామన్నారు జగన్. ఆరోగ్య శ్రీద్వారా మెరుగైన వైద్యం అందించడంతో పాటు 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.