ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పెర్పామ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ ఎన్నికల బరిలో దిగింది. ఏప్రిల్ 20న ఉదయం ఆమె కడప పట్టణంలోనామినేషన్ వేశారు.
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. మొదట ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనల్లో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయ నుంచి ర్యాలీగా వెళ్లారు. కడప కలెక్టరేట్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
కడప జిల్లా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూల తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు షర్మిల. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని, రాష్ట్రానికి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు.