YS Sharmila : వైఎస్సార్‌కు తగిన గౌరవం ఇవ్వలేదు : వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్‌కు కాంగ్రెస్ తోపాటు టీఆర్‌ఎస్ ద్రోహం చేశాయన్నారు వైఎస్ షర్మిల;
YS Sharmila : ఏపీలో వైసీపీ గురించి ఇప్పుడేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఎక్కడో ఏదో జరిగింది కదా అని ప్రశ్నలడిగి... తాను చెప్పిన సమాధానాలను హాట్ టాపిక్‌గా చేస్తే అది వైఎస్సార్‌ను అగౌరవపరిచినట్లవుతుందన్నారు. ఇవాళ వైఎస్‌ఆర్ జయంతి కాబట్టి... వైఎస్సాఆర్ మెమోరియల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నట్లు తెలిపారు తాను ఏదో ఒకటి మాట్లాడితే.. అదే హైలెట్ చేస్తారంటూ.... జగన్ గురించి ప్రశ్నను దాటవేశారు షర్మిల.
వైఎస్సార్‌కు కాంగ్రెస్ తోపాటు టీఆర్‌ఎస్ ద్రోహం చేశాయన్నారు. వైఎస్సాఆర్ ఇచ్చిన అధికారాన్ని ఎక్కి ఊరేగారు కాని.. ఆయనకు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ కోసం హైదరాబాద్‌లో సెంట్‌భూమి లేకుండా చేశారన్నారు. వైఎస్సాఆర్ ఘాట్ కోసం ఇచ్చిన భూమిని సైతం.. సీఎం కేసీఆర్ వెనక్కు తీసుకున్నారంటూ విమర్శించారు. కేసీఆర్‌కు తెలంగాణభవన్‌కు భూమి ఇచ్చిందే వైఎస్సార్ అని గుర్తు చేశారు. కేసీఆర్ వైఎస్సాఆర్‌కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్‌లో వైఎస్సాఆర్ మెమోరియల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.