కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు ఉచిత ప్రయాణంపై వాగ్ధానం నిలబెట్టుకోలేదన్నారు. తెలంగాణ, కర్ణాటక లో ఈ పథకం విజయవంతం అయిందనీ.. తెలంగాణలో రెండో రోజే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో వచ్చిందన్నారు.
కర్ణాటకలో మూడు వారాలకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. మరి చంద్రబాబుకి ఎందుకు ఇంత సమయం పడుతుందో.. సమాధానం చెప్పాలి... అని షర్మిల డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖ ఉక్కుప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన హామీలకు అనుగుణంగా బీజేపీ నుంచి చంద్రబాబు నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీకి, వైఎస్ఆర్ కు సంబంధమే లేదని.. వైఎస్ వారసురాలిని తానేనని వైఎస్ షర్మిల అన్నారు.