YS Viveka Murder Case: సీబీఐ కీలక ప్రకటన..సమాచారం ఇస్తే రూ.5 లక్షలు..!

YS Viveka Death Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకు సంబంధించి సమాచారం చెప్పాలంటూ సీబీఐ చేసిన పత్రికా ప్రకటన కడపలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Update: 2021-08-21 04:49 GMT

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకు సంబంధించి సమాచారం చెప్పాలంటూ సీబీఐ చేసిన పత్రికా ప్రకటన కడపలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమాచారం చెప్పిన వారికి 5 లక్షలు ఇస్తామంటూ ప్రకటన చేసింది. ఈ హత్య కేసు చిక్కుముడి విప్పేందుకు దాదాపు 80 రోజుల్లో వందల మందిని విచారించింది. ఇప్పటికే సునీల్‌ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్‌ చేశారు. గత కొద్ది రోజులుగా వివేకా కుటుంబ సభ్యులను విచారించారు. మరోవైపు గత రెండు నెలలుగా వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి విచారిస్తూనే ఉంది సీబీఐ.

2019, మార్చి 15న పులివెందులలో వైఎస్‌ వివేకా హత్యకు గురయ్యారని.. సమాచారం చెప్పాలంటూ సీబీఐ చేసిన పత్రికా ప్రకటన ఇప్పుడు కడప జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. సమాచారం చెప్పిన వారికి 5 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. అయితే.. నార్కో అనాలసిస్‌ టెస్టులు, ఆయుధాల అన్వేషణతో కేసు కీలక దశకు చేరిందనుకుంటే.. మళ్లీ మొదటికొచ్చిందని పలువురంటున్నారు.

Tags:    

Similar News