ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి - వైఎస్ సునీత
Ys Viveka Death Case: తమకు రక్షణ కల్పించాలంటూ కడప జిల్లా ఎస్పీకి సునీత లేఖ రాశారు.;
Ys Viveka Death Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. తాజాగా సీబీఐ ఎదుట ముఖ్యమంత్రి కార్యాలయం కోఆర్డినేటర్ రఘునాథరెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో ఇది కీలక పరిణామంగా మారింది. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అటు.. తనకు ప్రాణ హాని ఉందని వివేకా కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ కడప జిల్లా ఎస్పీకి సునీత లేఖ రాశారు. ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్ తరువాతి డోర్ దగ్గర ఆగి ఫోన్ కాల్స్‌చేశాడని లేఖలో సునీత వెల్లడించారు.