ఏపీలో ప్రధాన ప్రతిపక్షం YSRCPకి మరో బిగ్ షాక్ తగిలే చాన్స్ కనిపిస్తోంది. వైసీపీ నేత, AP మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామాకు రెడీ అవుతున్నట్టు సమాచారం. వీలైనంత తక్కువ టైంలోనే పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో వాసిరెడ్డి పద్మ ఆ పార్టీ తరుపున టికెట్ ఆశించారు. అయితే అప్పుడు టికెట్ దక్కలేదు. అప్పుడే రాజీనామా చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ టికెట్ దక్కకపోయినా ఆమె జగన్ వెంటే వుంటానంటూ ప్రకటించారు. అయితే పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా వుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం, పార్టీల నుంచి ఆమెకు ప్రాధాన్యత కల్పించే పోస్టు దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.