మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఏపీకి రాజధాని లేకుండా చేయాలని అనేక రకాల కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి అమరావతి రాజధానిగా ఉండకూడదు అని ఉద్దేశంతో.. మూడు ముక్కలాట ఆడారు. కానీ మూడు రాజధానులకు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం చేసి.. అమరావతి ప్రజలకు.. అటు ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా చేసి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో అందరం చూశాం. ఆయన చేస్తున్న అరాచకాలను చూసి.. ఏపీ ప్రజలు అత్యంత దారుణంగా వైసిపి పార్టీని ఓడించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా అభివృద్ధి జరిగితే ఎప్పటికీ వైసీపీ పార్టీని ప్రజలు పట్టించుకోరు అని జగన్ కు అర్థమైంది. అందుకే అమరావతి రాజధానిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ నాటకం మొదలుపెట్టారు. ఏకంగా రాజధానికి ఏం పేరు పెట్టాలో కూడా ఆయనే చెప్పేస్తు తన అహంకార ధోరణి బయటపెట్టారు. అంటే అమరావతిని ఇప్పటికిప్పుడు మధ్యలో ఆపేసి మళ్ళీ కొత్తగా రాజధాని కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలి అనేది జగన్ ఉద్దేశం. దానివల్ల ప్రజల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తి అశాంతి రాజెయ్యాలి అనేది జగన్ కుట్ర కూటమినేతలు ప్రచారం చేస్తున్నారు.
కానీ ఇక్కడ జగన్ ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఎన్ని రకాల ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా సరే ప్రజలు ఎవరు పట్టించుకోరు. మావిగన్ అనేది ఎంతగా విమర్శలకు దారితీసిందో అందరూ చూశారు. మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించి తాను రాజకీయంగా లబ్ధి పొందాలి అని జగన్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రజలు ప్రతిసారి మోసపోరు అనే విషయం కూడా జగన్ గుర్తుంచుకోవాలి. 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చారు. కానీ ఒకసారి జగన్ కుట్రలు తెలిసిపోయాక ప్రజలు ఎవరూ కూడా ఆయన మాటలను పట్టించుకోవట్లేదు. అందుకే మావిగన్ ప్రకటనకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు రావట్లేదు.