YSRCP : కల్తీ నెయ్యి కేసు ఉత్తదేనట.. వైసిపి అబద్ధాలకు హద్దే లేదా..!

Update: 2025-11-26 12:30 GMT

వైసిపి నేతల తీరు ఎలా ఉంది అంటే.. కూటమి ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా సరే అది అత్యంత చెడ్డది అన్నట్టు ప్రచారం చేయాలి. అదే వైసిపి నేతలు అక్రమాలు, అవినీతి, మహా పాపాలు చేసినా సరే అసలు ఏమీ లేవని అవన్నీ ఉత్తవే అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకోవాలి. వైసీపీకి మొదటి నుంచి అలవాటు అయిన విధానం ఇదే. మరీ దారుణం ఏంటంటే కల్తీ నెయ్యి కేసు ఉత్తదే అంటూ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. పరకామణి కేసులో అసలు ఏమీ లేదని అదంతా కూటమి చేస్తున్న తప్పుడు కుట్రలు అంటూ భూమున కరుణాకర్ రెడ్డి అంటున్నారు. కల్తీ లిక్కర్ కేసులో ఒక్క ఆధారం కూడా చూపించలేదని జోగి రమేష్ చెబుతున్నారు. ఇది ఎంత దారుణం అంటే అడ్డంగా దొరికారని పోలీసులు సాక్షాలు కూడా బయట పెడితే అదంతా ఉత్త కేసులే అంటూ వైసీపీ నేతలు చెప్పడం వారి అబద్ధాలకు హద్దు లేదు అని నిరూపించుకున్నట్టే అంటున్నారు ఏపీ ప్రజలు.

కల్తీ నెయ్యి కేసులో ఒక్క సాక్ష్యం కూడా లేదు అని వైవీ సుబ్బారెడ్డి చెప్పటం అంటే అంతకుమించిన దారుణం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ నిజాలను దాచేస్తుంది అని.. వైవీ సుబ్బారెడ్డి స్వయంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ సిబిఐ ఎంక్వయిరీ వేయించుకున్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ లడ్డు తయారీ కోసం వాడిన నెయ్యి అసలు నెయ్యి కాదని.. కంపెనీల్లో వాడే కెమికల్ లాంటి పదార్థం నెయ్యికి బదులుగా వాడారని ఆధారాలతో సహా బయట పెట్టింది. 68 లక్షలు కేజీల నెయ్యి లాంటి కెమికల్ పదార్థాన్ని తీసుకొచ్చి 20 కోట్ల లడ్డూలు తయారు చేయించి 100 కోట్ల మందితో తినిపించిన మహా పాపాన్ని సిబిఐ స్వయంగా సాక్షాలతో మీడియా ముందు పెడితే.. ఒక్క సాక్ష్యం కూడా లేదు అంతా ఉత్త కేసే అంటూ వైవీ సుబ్బారెడ్డి చెప్పటం అంటే నిజంగా ఆయన అబద్ధాలు చెప్పటంలో పీజీ చేసినట్టే.

ఓవైపు కల్తీ లిక్కర్ కేసులో నోట్ల కట్టలు అడ్డంగా దొరికితే.. అద్దేపల్లి జనార్దన్ రావు అప్రూవర్ గా మారి జోగి బ్రదర్స్ చేసిన కుట్రలను మొత్తం బయట పెడితే అసలు ఏమీ సాక్షాలు లేవని చెప్పటం వాళ్ల విజ్ఞతకు నిదర్శనమే. ఇలా కల్తీల కేసులు వైసీపీ మెడకు చుట్టుకోవడంతో ఏం మాట్లాడాలో తెలియక ఇలా తిక్క తిక్క సమాధానాలు ఇస్తున్నారు అంటున్నరు కూటమినేతలు. త్వరలోనే ఈ కేసుల్లో అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది అధికారులు బయట పెడితే అప్పుడు వీళ్ళు ఇంకేం అబద్ధాలు చెప్తారు వేచి చూడాలి.

Tags:    

Similar News