Yuvagalam: అధైర్య పడొద్దు రాబోయేది టీడీపీనే..

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 38వ రోజు చేరుకుంది

Update: 2023-03-08 03:05 GMT

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 38వ రోజు చేరుకుంది. ఇప్పటి వరకు 483.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. యువ నేతకు ప్రజలు అడుగడుగునా మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. లోకేష్‌ ఎక్కడికి వెళ్లిన జనప్రభంజనమే కన్పిస్తోంది. వివిధ వర్గాలతో మమేకం అవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అధైర్య పడొద్దని రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని.. అందరికి అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు.

ఇక ఇవాళ ఉదయం పీలేరు నియోజకవర్గంలోనే పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 8గంటలకు చింతపర్తిలోని బోయపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారు. 9గంటలకు బోయపల్లి క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 11గంటలకు విటలం గ్రామంలో స్థానికులతో సమావేశం అవుతారు. పాదయాత్రగా వెళ్లి మధ్యాహ్నం 12గంటలకు పునుగుపల్లిలో స్థానికులతో భేటీ నిర్వహిస్తారు. 12.20నిమిషాలకు పునుగుపల్లిలో భోజన విరామం తీసుకుంటారు.

భోజన విరామం అనంతరం పునుగుపల్లి నుంచి పాదయాత్ర కొనసాగనుంది. ఇక 3గంటలకు వాయల్పాడులో మైనారిటీలతో సమావేశం కానున్నారు. 3.25 నిమిషాలకు వాయల్పాడు ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. 5గంటలకు మదనపల్లి నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ఎంట్రీ ఇస్తోంది. సాయంత్రం 6.30 నిమిషాలకు పాదయాత్రగా పూలవాండ్లపల్లి వద్ద విడిది కేంద్రానికి చేరుకుంటారు. ఇక రాత్రికి లోకేష్‌ అక్కడే బస చేస్తారు.

Tags:    

Similar News