బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఐఎఫ్ఎఫ్ఐ 2024 ఈవెంట్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె నెపోటిజమ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నెపోటిజమ్‌కు ఇండస్ట్రీ బాధ్యత వహించదని అనుకుంటున్నాను. ఈ విషయంలో మీడియా, ప్రేక్షకులు కీలక పాత్ర పోషిస్తారు. కొందరు స్టార్ కిడ్స్ పట్ల మాత్రం మీడియా ఎలా వ్యవహరిస్తుందో ప్రేక్షకులు చూడాలనుకుంటారు. ఆ స్టార్స్ పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపించడంతో మేకర్స్ కూడా వారితో సినిమా చేయాలని భావిస్తారు. ఇది ఒక సర్కిల్. మీలో టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. లేకపోతే అక్కడికి చేరుకోలేరు. నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ సాదర స్వాగతం పలికింది. కాకపోతే, సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోతే, కోరుకున్నది అందుకునేందుకు, మ్యాగజైన్ కవర్‌లో చోటు సంపాదించుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఇండస్ట్రీలో ప్రతిదీ కొంచెం కష్టంతో కూడుకునే ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చింది కృతి.