వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4గంటల లోపు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే సజ్జలపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. మరోవైపు.. ఏపీలో మీడియాతో మాట్లాడిన సజ్జల.. తాను దావూద్ ఇబ్రహీం కాదని విదేశాలకు వెళ్లి రాగానే తనకు లుకౌట్ నోటీసులు ఎయిర్ పోర్టులో ఇవ్వడం దారుణం అని అన్నారు.