New SUV : 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 ఎస్‌యూవీలు ఇవే.

Update: 2025-10-25 08:15 GMT

New SUV : కొత్త సంవత్సరం రావడానికి ఇంకా కొన్ని నెలలే మిగిలి ఉంది. కానీ, ఈ మిగిలిన నెలల్లో భారత కార్ల మార్కెట్​లో పెద్ద సందడి జరగనుంది. దేశంలోని నాలుగు అగ్రశ్రేణి కంపెనీలైన హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా నాలుగు పెద్ద ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4న రాబోతుండగా, టాటా సియెర్రా, కొత్త కియా సెల్టోస్, మహీంద్రా XEV 7e కూడా క్యూలో ఉన్నాయి. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ 4 ఎస్‌యూవీల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కొత్త హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ నెక్స్ట్ జనరేషన్ వెన్యూను నవంబర్ 4న లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. దీని బుకింగ్‌లు ఇప్పటికే రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఎస్‌యూవీ మొత్తం 12 కొత్త HX వేరియంట్లలో (పెట్రోల్ NA, టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజన్లు) అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుత మోడల్ కంటే ఇది మరింత ఎత్తు, వెడల్పు, ఎక్కువ స్థలంతో ఉంటుంది. దీని డిజైన్, స్టైలింగ్ ఎక్కువగా క్రెటా నుండి ప్రేరణ పొందాయి. హెజెల్ బ్లూ, మిస్టిక్ సఫైర్ అనే కొత్త రంగులు కూడా జోడించబడ్డాయి. లోపల, క్రెటాలో ఉన్నటువంటి రెండు 12.3-అంగుళాల కర్వ్డ్ పానోరమిక్ డిస్‌ప్లేలు, యాంబియంట్ లైటింగ్, 4-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా సియెర్రా

ఒకప్పుడు ఐకానిక్‌గా నిలిచిన టాటా సియెర్రా పేరు రాబోయే కొద్ది వారల్లో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సరికొత్త సియెర్రా మూడు ఇంజన్ ఆప్షన్లతో (పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్) రానుంది. పెట్రోల్ వేరియంట్ మొదట కొత్త 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో వస్తుంది, ఆ తర్వాత 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను జోడిస్తారు. డీజిల్ సియెర్రాలో 2.0-లీటర్ ఇంజన్ (హారియర్/సఫారీలో ఉన్నటువంటిది) ఉండే అవకాశం ఉంది. ఇక సియెర్రా ఈవీలో హారియర్ ఈవీలో ఉపయోగించిన పవర్‌ట్రెయిన్‌లనే వాడవచ్చు.

కొత్త కియా సెల్టోస్

రెండవ తరం కియా సెల్టోస్ 2025 చివరిలో లాంచ్ కావచ్చు. ఇది 2026 ప్రారంభంలో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఎస్‌యూవీ కియా కొత్త ఆపోజిట్స్ యునైటెడ్ డిజైన్ ఫిలాసఫీని కలిగి ఉంటుంది. ముందు భాగంలో కొత్త గ్రిల్, సన్నని, నిలువుగా ఉండే DRLలు, కొత్త డిజైన్ ఫాగ్ ల్యాంప్‌లు ఉంటాయి. సైడ్, రియర్ ప్రొఫైల్‌లలో కూడా పెద్ద మార్పులు ఉంటాయి. ఇంటీరియర్‌ను కియా సైరోస్ నుండి తీసుకున్న ట్రిపుల్ స్క్రీన్, అనేక కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేయవచ్చు. అయితే, ఇంజన్ సెటప్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

4. మహీంద్రా XEV 7e

మహీంద్రా & మహీంద్రా డిసెంబర్ 2025లో XEV 7e అనే 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయవచ్చు. ఇది తన ప్లాట్‌ఫామ్, పవర్‌ట్రెయిన్, డిజైన్ , ఫీచర్లను XEV 9e తో షేర్ చేసుకుంటుంది. అయితే, ఇందులో మూడు వరుసల సీటింగ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. చిన్న బ్యాటరీ ప్యాక్‌పై 500 కి.మీ కంటే ఎక్కువ, పెద్ద బ్యాటరీ ప్యాక్‌పై సుమారు 650 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా. ఇది 175kWh వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Tags:    

Similar News