Airtel New Prepaid Plan : రూ.9కే 10GB డేటా.. కానీ గంటే వ్యాలిడిటీ

Update: 2024-06-22 07:01 GMT

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ( Airtel ) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.9తో రీఛార్జ్ చేసుకుంటే 10GB డేటా లభిస్తుంది. అయితే దీన్ని కేవలం గంటలోనే వాడుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద ఫైల్, మూవీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇతర సర్వీస్ ప్రొవైడర్లలో 10GB డేటాకు రూ.100 వరకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ రూ.9 ప్లాన్ అందరికీ సరిపోకపోవచ్చు.

ఎవరైనా పెద్ద డేటా ఫైల్‌ లను డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్లాన్స్ రీచార్జ్ చేసుకుంటారు. మరి కొందరు వేగంగా కొన్ని డౌన్‌లోడ్స్ అవసరమైతే ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సినిమా ప్రియుల కోసం ఏదైనా సినిమా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. డేటా ఎక్కువే అవసరం పడుతుంది. అందుకే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఒకేసారి చాలా సినిమాల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇకపోతే, ఎయిర్టెల్ ఇటీవల భారతదేశంలో రూ. 395 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును పెంచింది. ప్యాక్ ఇంతకుముందు 56 రోజుల చెల్లుబాటును అందించింది. కానీ ఇప్పుడు 70 రోజులకు పెరిగింది. అయితే, ప్యాక్ యొక్క ఇతర ప్రయోజనాలు మారవు. ఈ ప్లాన్ లో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లను, 6 జీబీ డేటాను, 600 SMS లను పొందుతాము. ఇక ఇదే ప్లాన్ మాదిరి జియో కూడా ఇదే విధమైన ప్లాన్‌ను అందిస్తుంది. దీనికి 84 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఇది ఎయిర్‌టెల్ ప్యాక్ కంటే రెండు వారాలు ఎక్కువ చెల్లుబాటు ఉంటుంది.

Tags:    

Similar News